శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
39. కామేశ్వరజ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా | ||
*ఈషజ్ఞత* : ఈశ్వరునిచే తెలియబడినది అని అర్ధము. తాను వున్నాను అన్న పరహంత లక్షణము. అదియే ఈశ్వరా సంకల్పము, ఈశ్వర చైతన్యము. ఈశ్వరుని గురించి ఆమెకి తప్ప మరొకరికి తెలియదు. అలాగే, తన గురించి ఈశ్వరునికి తెలిసినట్టుగా మరొకరికి తెలియదు. ఆ పరస్పర ఈక్షణమే ఈషజ్ఞత. *కామేశఙ్ఞాత* : ఈశ్వరుడే కామేశ్వరుడు. ఆ కామేశ్వరునే వల్లభునిగా పెట్టుకొని సమస్త సృష్టిని అమ్మవారు చేసినది. కామేశఙ్ఞాత అంటే ఇది అర్ధం. *సౌభాగ్య* : పంచదశీ విద్యను సౌభాగ్య విద్య అని అంటారు. అమ్మవారు పంచదశీ మంత్రం స్వరూపిణి. *మార్దవ* : పరమ సుకుమార మైనటువంటిది. అంటే కరుణా స్వభావము కలది. పరమ సౌందర్యరాశి. *ఊరుద్వయం* : మాతృకావర్ణములో ' ఉ, ఊ 'అన్నవే ఉరుద్వయము. శ్రీచక్ర స్వరూపిణిగా భావించినప్పుడు అవి *ఉరుద్వయములు* .. అవి దేనికి సంజ్ఞ అంటే ఈ సమస్త సృష్టిని పెంచేటట్టివి. ఆ పెంచే కళికాస్థానము ఆ ఉరువుల మధ్యవుంటుంది. కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తొడలను కూడినది 🙏 🌺*ఈ నామం మనకు* 🌺 గుహ్యంగా ఉండి మన ఉనికినీ, బలాన్ని, సమతుల్యగా ఇచ్చే మంత్రము 🙏 |