శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
41. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభ జంఘికా | ||
*ఇంద్ర* : అంటే మాయ. మనలో మాయను కల్పించేవి మన ఇంద్రియములే. మనలో బ్రహ్మమును చూపించే వాటియుక్క సంయమనమే. అందుచేత ఇంద్రశబ్దముచేత 'బ్రహ్మ ' అని, మాయ అని, ఇంద్రియములని, అర్ధం వస్తుంది. అలాగే అమ్మవారు బ్రహ్మణిగాను, మాయాస్వరూపిణిగాను ఈ ఇంద్ర శబ్దముచేత తెలియబడుతుంది. *గోప* : అంటే రహస్య అవ్యక్తము, సర్వము రహస్యమే కాబట్టి అమ్మవారు వ్యక్తావ్యక్త స్వరూపిణి. ఇంద్రియములను మనము మేల్కొలిపే వరకు గోప్యముగానే వుంటాయి. *ఇంద్రగోప* : మాయచేత గోప్యముగా వుంచబడిన బ్రహ్మపదార్థమును, తెలుసుకోనివ్వకుండా ఇంద్రియములు మనకు అడ్డుపడతాయి. అంటే బ్రహ్మ పదార్థమును గోప్యముగా వుంచటమే ఇంద్రగోప. *స్మర* : స్మర, కామ మన్మధ అంటే సదాశివుడే తప్ప, మన్మధుడు కాదు. *తునాభ* : అంటే అంబులపొది ఆభ అంటే కాంతి. అక్కడైనా కాంతి వున్న చోట నాదమువుంటుంది. నాదమువున్నచోట కాంతి వుంటుంది. నాదముతో వచ్చే పదములు, బీజములు, మంత్రములన్నియు బాణములు. ఇవి బ్రహ్మమును చేర్చే బాణములు. వాటిని దాచిపెట్టే తుణము, తూణీరముని తునాభ అంటారు. *జంఘిక* : పిక్కలు కలది అని అర్ధము. ఎర్రని రంగుతో నున్న ఆరుద్రపురుగుచే చెక్కబడిన మన్మధుని అమ్ములపొదుల వలే ఉన్న జంఘలు (పిక్కలు) కలది అని అర్ధం. మోక్ష మిచ్చి రక్షించేది మరియు స్మరణ మాత్రంచేత కోరికలను పూరించి, ప్రకాశావిర్భావం చెసే తల్లికి నమస్కారము 🙏 🌺 *ఈ నామంవల్ల మనలో,*🌺 మన ఇంద్రయాలను సన్మార్గములో ఆలోచనని కలిగిస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడి, మన లక్ష్యం వైపు నడవగలిగే శక్తిని సంతరించుకుంటాము 🙏 |