శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
22. తాటంకయుగళీభూత తపనోడులమండలా | ||
ఇందులోని కొన్ని గుప్తనామములు *తపనమండల* : కాంతి చేత ఆమె సూర్యమండలమైనది . *ఉడుప మండల* : అదే కాంతి వల్ల చంద్రమండలమైనది. నక్షత్రమండల , తారామండలం , ఈ రెండూ అమ్మవారి యుక్క నేత్రములు . *యుగళీ* : యుగళీ అంటే లోపల ఉన్నపటికీ ఒకటిగా వుండటం . శివశక్తి స్వరూపం ,అర్ధనారీశ్వర తత్త్వం . **తాటంక* అమ్మవారి యుక్క తాటంకములు . తాటంకముగా తపన మండల ఉడుప మండలము కలది. అంటే సూర్య చంద్రులే ఆమె యుక్క కర్ణాభరణము . *కయుగళీ* : క అంటే బ్రహ్మము యుగళీ అంటే రెండు . బ్రహ్మము మాయా వేరు కాదు . బ్రహ్మము అవ్యక్తమైతే దాని యుక్క వ్యక్తస్వరూపమే మహామాయా . అమ్మవారు నిర్గుణ సగుణ రూపములతో , ఉపాస్య అనుపాస్య రూపములతో వున్నది . కాబట్టి ఆమె బ్రహ్మ స్వరూపిణి , బ్రహ్మి , అందువలన కయుగళీ . అంటే సగుణ నిర్గుణ లక్షణములు రెండు తనయందే ఇముడ్చుకున్న జగన్మాత . *యుగ మండల* : కొన్ని యుగములు కలిస్తే ఒక కల్పము , కొన్ని కల్పములు కలిపితే ఒక మన్వంతరము . ఇలా యుగ కల్ప మన్వంతరం దృష్టిలో కాలస్వరూపిణిగా వుంటుంది . ఆమె యుక్కా కనురెప్పపాటులో ఎన్నో మన్వంతరములు , ఎన్ను కల్పములు ఎన్నో యుగములు వెళ్లిపోతాయి . ఇది అంతర్గతంగా ఈ నామంలో తెలుసుకోవలసిన విషయాలు . సామాన్యమైన అర్ధం ,... శ్రీ లలితా సూర్య చంద్ర మండలముల వంటి చెవి కమ్మలను ధరించినది . అన్ని మండలములకి ఆదిదేవతైన ఆ పరా శక్తి కి నమస్కారము 🙏 🌺ఈ *నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనము* 🌺 మనము నిత్యం సూర్య చంద్రుల నుంచి ప్రసరించే కాంతి, వల్ల మన ప్రాణ శక్తి ని నిలుపుకుంటూ చేసే శ్వాసక్రియతో , మనకు తెలియకుండానే ఒక ఆత్మ విశ్వాసం కలుగుతుంది .ఆ ఆత్మ విశ్వాసమే జగతజనని లలితపరమేశ్వరి , మనలో వుంటుంది 🙏 |