శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
30. కామేశభద్ద మాంగల్య సూత్ర శోభిత కంధరా | ||
కామేశ్వరునిచే కట్టబడిన మాంగల్య సూత్రముచే అలంకరింపబడిన మెడ కలది అన్నది సామాన్యార్థము. ఇందులోని గుప్త నామములు వాటికీ అంతరార్ధం *ఈశబద్ధ* : ఈశ్వరుని తనయందే బంధించుకున్నది, వారి పరస్పర ఈక్షణము చేత తానూ బద్దమైనది, ఈశ్వరుడు బద్ధుడైనాడు. *కామేశబద్ధ* : కామేశ్వరుని సంకల్పముచేతనే ముడివడినది మహామాయా . కాబట్టి ఆమె కామేశబద్ధ అయినది. ఈ రెండింటిమధ్య భేదము లేదు అని రహస్యం. *సుమాంగల్య* : సృష్టిని ప్రభవించబోయేదిని అని ఒక అర్ధం. సు అంటే పరిపుష్టమైనది. శుభకరమైనది , విశ్వయోని అని మరొక అర్ధం. *సూత్రశోభిత* : బిందు స్పంద ప్రతిస్పందములుగా అనంతకాలము వరకు నడిచే లలితపరమేశ్వరి యుక్క ఇచ్ఛస్వరూపము. దానిచేత ఆమె సౌందర్యవల్లి, సౌందర్యలహరి అయంది. ఇచ్చా శక్తి , జ్ఞాన శక్తి, క్రియా శక్తి, స్వరూపమే సూత్రము. ఎందుకంటే సంకల్పంలో నుండే కూర్కే పుడుతుంది. అదే ఇచ్చా శక్తి, ఈ కోర్కె నెరవేరటం ఎలాగ అని ఆలోచన చేస్తుంది మనస్సు. అదియే జ్ఞాన శక్తి,. సాఫల్యం వస్తుంది అని మనస్సు దృడమైతే క్రియాశక్తిగా మారుతుంది. ఈ మూడుకలిపితే కామము(కోరిక ) సాఫల్యమవుతుంది. ఈ మూడు సమన్వయమైతేనే సూత్రము అని తెలుసుకోవాలి. మహామాయా స్వరూపిణి. *కందరా* : బ్రహ్మ పదార్ధమును ధరించినది, గళసీమ, మెడ (neck ) ఈశ్వరప్రతిబింబమును ధరించినది అని అర్ధం. పరమేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రంచే ప్రకాశించు గళసీమ గల తల్లికి నమస్కారము 🙏 🌺 *ఈ నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనము* 🌺 మెడ, జ్ఞాన మార్గానికి, కర్మమార్గానికి మధ్యన వంతెన వంటిది. అటువంటి సమన్వయము చేసే శక్తి కేంద్రం చైతన్యవంతవుతుంది. 🙏 |