శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
72. భండసైన్యవధోద్యుక్త శక్తివిక్రమహర్షితా | ||
ఇందులోని గుప్త నామములు *శక్తి విక్రమ* :మనలోని శక్తియే కుండలినీ శక్తి. ఈ శక్తియుక్క విక్రమము అంటే విషేశక్రమము, ఇడ పింగళ నాడులు రెండు జడలు అల్లుకున్నట్లుగా ఉంటే ఆ మధ్యలో వున్నది త్రిజటా స్వరూపము. ఇడా, పింగళా జడయుక్క పాయలైతే ఆ మధ్యలో బిసతంతు తనియసిగా సుషుమ్నా వెళుతూ వుంటుంది. . ఈ నాడీలు, వాటియుక్క ప్రాణశక్తి సరిగ్గా ఉండకపోతే అనేక అనర్ధములు, వ్యాధులు వస్తాయి. వీటిని యోగ సాధన ద్వారానే సరైన రీతిలో నడిపించాలి. యోగ సాధన అంటే మన శరీరాన్ని క్రమశిక్షణ లో పెట్టాలి. మనలో ఉతేజాన్ని నింపుకోవాలి. *హర్షిత :* ఆమె ఎప్పుడు ఆనందఘనయే కాబట్టి సుఖము వచ్చిన, దుఃఖం వచ్చినా ఆమె చిరునవ్వు చిందిస్తుంది. అది ఆమె లీలావిలాసము. *మహర్షిత* : తల్లీ కృప ఉంటేకానీ మనలో బ్రహ్మసంస్కారములు ఉద్భావము కాదు. పూర్వజన్మము నుండి తెచుకున్నవి పెంపొందవు. పెంపొందే ప్రయత్నమూ చేయటానికి సద్గురువులు దొరక్కపోవచ్చు. సద్గురువులు దొరికిన మన అశ్రద్ధ చేత మనము ఆ విద్యను కాలరాసుకోవచు. ఇన్ని అవయోగములు మన జీవచాపల్య చేత పడుతున్నప్పుడు మనకు మహర్షితత్వము పట్టే యోగ్యత ఉన్నప్పటికీన్ని పట్టదు. అట్టిదే పడితే ఆ తల్లీ మనయందు స్వయముగా కృప చూపించినదినీ అర్ధము. ఈ నామములో వున్నది కుండలినీప్రస్థానము. భండము అంటే ఇంద్రియ గ్రామము. అనగా చైతన్య వృత్తులు, క్రియలు, సంకల్పము. పంచకర్మేంద్రియము, పంచజ్ఞానేంద్రియము, పంచతన్మాత్రలయుక్క సమస్తు ఇంద్రియ గ్రామము లేక భండము. దానిని అంటిపెట్టుకొని ప్రేరణ చేసే స్నాయుమండల మంతా భండసైనము. హృదయము దెగ్గర 108 నాడులు, శరీరాంతర్గతముగా 72వేల నాడులు అన్ని కలిపి భండ సేన. వధ అంటే వాటి ప్రకోపాన్ని సుప్తం చేయటము, నిరస్తం చేయటము. భండాసురుని సైన్యాన్ని వధించటానికి ఉద్యుకమై ఉన్న తన శక్తి సైన్యాన్ని చూసి హర్షాన్ని పొందుతున్న తల్లికి నమస్కారము 🙏 🌺మన శరీరంలో కుండలిని శక్తి నీ జాగృతం చెయ్యాలి. అంటే మనలోవుండే అలసత్వం, బద్ధకం, వంటి భండాసురులను వధించాలి. అమ్మ మెప్పుని పొందాలి. 🌺 |