*మహాపశుపతి* : మాయయందు నామరూపములతో జన్మించిన జీవులు ద్వందములకు అధీనులై పొందే కష్టసుఖఃములు అన్ని పశులక్షణములు. ఆ పశువులందరికిని పతియైనవాడు సదాశివుడు.
పశుపతియే సదాశివుడు అని అర్ధం.
*పాశుపతము* : పాశుపతము అనే అస్త్రము మనలో పశుభావాలను తొలగించే అస్త్రము. అదియే ప్రాణము. దానిని సదాశివుడు బ్రహ్మాండమునుండి ప్రాణరూపముగా పంపిస్తూ ఉంటే దానిని శ్వాసగా మార్చుకొని మనము మాయగా చేసుకుంటున్నాము. దానిలో వుండే ఉదానవయువనే ప్రాణమును పైకి తీసుకొని వెళ్లగలిగితే ఈ పాశుపతము పోయి బ్రహ్మపదము వస్తుంది.
*అస్త్రాగ్ని* : అస్త్రము అంటే మంత్రముచేత ప్రయోగించబడే ఆయుధం. స్వాధిష్టానమునందున్న అగ్ని. ఓంకారమును వింటూ, భావనచేస్తూ మనంచేసే మూలాధార కుంభకమే అస్త్రము.
*నిర్దగ్ధ* : ఎప్పుడుడైతే సుషుమ్న జాగృతమై మూలాధారమునుండి స్వాధిష్టానమును దూసుకొనుచూ మణిపురం చేరి, జలమండలంలో రెండు లిప్తల కాలం వుండి, అప్పుడు కనులు తెరిచి నేను బ్రహ్మను, మాయ ను కాను అని తెలుసుకుంటుందో. అపుడే *అహం బ్రహస్మి* అన్న భావన కలుగుతుంది.
*అసురసైనికా* : అంటే అసురలక్షణాలు కలిగి ఉండటం, అనగా స్థాపిత కుండలి, మహామాయా స్వరూపము. అనగా జీవచాపల్యము.
ఈ చాపల్యం వలన దేహము శ్శాశ్వతము అని, దేహమే ఆత్మ అని భ్రమలో ఉంటాడు జీవి.
ఇటువంటి ఆలోచన సరళి కల్పించేది, మాయ ను సృష్టించేది కూడా ఆ జగన్మాతయే.
మన శరీరము లో 36తత్వములు, పంచకోశములు, పంచకర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములు, మనో, చిత్, అహంకారములే అసుర సైనికులు.
*అహంబ్రహ్మస్మి* అన్న భావన కలిగినప్పుడు, మనలో వుండే అసుర ప్రవుత్తి (సైన్యాన్ని) దగ్ధం చేస్తుంది.
మహాపాశుప సస్త్రము నుండి ఉద్భవించిన అగ్ని చే అసుర సైన్యాన్ని దగ్ధం చేసిన తల్లికి నమస్కారము 🙏
🌺జనన మరణాల భయం, అనారోగ్యం, బంధుప్రీతి భయం వంటి వివిధ భయాలను తొలగించుకోగలిగే మానసిక శక్తి కలుగుతుంది. 🌺
|