శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
14. కురువింద మణిశ్రేణీ కనత్కోటీరమండితా | ||
ఇందులోని గుప్తనామములు *మణిశ్రేణీ* : అంటే ఆ నుంచి హా వరకు వున్నా మాతృకా వర్ణమాల స్వరూపిణి అమ్మవారు అని అర్ధం . *ఆ* నుండి *హా* వరకు ఉండటం వల్ల అదియే *అహం* అయినది . *మణిశ్రేణీ కోటిర* : అమ్మవారియుక్క కిరీటం రత్న మణి ప్రభలచేత ప్రకాశమానంగా ఉంటుంది అని అర్ధం . ఆ మణులు పాంచబౌతికమైన వస్తురూప మణులు కంటే విభిన్నమైనవి , విశిష్టమైనవి . పోల్చుటకు సాధ్యం కానివి . *కురువిందమణీ* : కురువిందము అంటే మాణిక్యము . మాణిక్యం మణి యుక్క రంగు ఎర్రగా ఉంటుంది. *కురుశ్రేణి* : ఆరు ఆకాశములు ఆమె యుక్క కురుశ్రేణి. అంటే ఆమె రచించిన వ్యూహాశ్రేణి . ఇక మనలో చుస్తే జ్ఞ్యానేంద్రియాలు కర్మేంద్రియములే కురుశ్రేణి . కురుసైన్యము పాండవసైన్యము . మనలో వున్నా సతభావనలు పాండవసైన్యము అయితే దుష్టభావనలు కౌరవసైన్యము . ఆమె క్రియాశక్తి కాబట్టి ఒక రీతిగా కాదు , అనేక రీతులుగా క్రియాశక్తి గా మనలో ఆమె వున్నది కాబట్టి ఆమె కురుశ్రేణి . *కనత్* : అంటే ప్రకాశించుచున్న అనంత స్వరూపిణి . *కోటి* : అంటే వంద లక్షలు అన్నది మాములు సంఖ్య . జగత్తు అంతా కలిపి చూడాలి అని అంటే శివశక్తి స్వరూపమును కోటి అని అంటారు. ఇది ఇందులో అంతరార్ధం . *కరమండిత* : కర అంటే చేయి కాదు ఇక్కడ , కిరణము అని అర్ధము . కిరణములుతోనే శోభిల్లు తల్లి తేజస్వరూపిణి , పరంజ్యోతి అని అర్ధం . మంత్రం రత్న స్థగిత కిరీటమే కురువింద మణిశ్రేణీ కోటీరము . కురువింద మణులతో ప్రకాశించే కిరీటంతో భాసించే తల్లి కి నమస్కారము 🙏. 🌺ఈ నామం వల్ల మనలో కలిగే మానసిక పరివర్తనం🌺 మనలో కలిగే ఆలోచనలు స్పటికములవలె , రత్నమువలె స్పష్టంగా , దోషరహితంగా , కాంతివంతంగా విలువైనవిగా ఉంటాయి .🙏 |