శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
52. శివకామేశ్శ్వరాంకస్థా | ||
*శివకామ* : శివబిందువు శుక్లబిందువు. శివ సంకల్పమే రక్తబిందువు. వారి పరస్పర ఈక్షణమే శివకామ. *ఈశ్వరాంక* : రక్తబిందువు యందు ఈశ్వర ప్రతిబింబము ఏర్పడటయే ఈశ్వరాంక. అంక అంటే సమీపము. ఈశ్వర ప్రతిబింబమును తనయందే దర్శించిన రక్తబిందువు స్వరూపిణి ఐనా మహామాయాస్వరూపిణి శ్రీలలిత. ఆమెయే ఈశ్వరాంక. *అంకస్థా* : విశుద్ధచక్రములో అంతర్యాగంలో సుషుమ్న పదహారు కళలను స్వీకరించనప్పుడు అర్ధనారీశ్వర స్వరూపమౌతుందని ధ్యానయోగములో చేపిన రహస్యం. ఇక్కడ అంకాస్థ అంటే తనకు అత్యంత సమీపములో వున్నది, లేదా సదాశివుని అంకమునందు వున్నది అన్న రెండు అర్ధాలు చెపుకోవచ్చును. కామేశ్వరుని అంకముపై (తొడపై) ఆశీనురాలయి వున్న తల్లి కీ నమస్కారము 🙏. 🌺మన నిజజీవితంలో, ప్రతి జంట (భార్య, భర్త )అర్ధనారీశ్వర తత్వం అన్న భావనతో, మసలుకోవాలి. ఆ విధమైన భావన మనలో శుభత్వాన్ని ఇస్తుంది. ఆరోగ్యమైన వాతావర్ణాన్ని కల్పిస్తుంది. ఇతరులకు ఒక మార్గదర్శకత్వగా వుండే అర్హతను పొందుతాము🌺. 🙏 |