శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
45. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ | ||
*పదద్వయ* : రెండు పదములు అన్నది సామాన్య అర్ధము ఈ నామం లో వున్న అంతరార్థం, నిరీశ్వర ఒక పదము, ఈశ్వర రెండో పధము. అవ్యక్తమునందు కామేశ్వర ఒక పదము, కామేశ్వరి రెండవ పదము. వ్యకవ్యక్తమునందు శివ ఒక పదము, శక్తి మరొక పదము. మహాత్తునందు, హిరణ్యగర్భ, హరిణి అన్న పదములు. ఈశ్వర పదార్థమును హిరణ్య అని పిలుస్తారు శ్రీసూక్తములో కూడా "హరిణీం" అని వస్తుంది. ఆ తరువాత వ్యక్తంలో అవి విశ్వాకుండలిని, వ్యష్టికుండలినియే అమ్మవారి యుక్క గురుపాదుకలు, ఉపాస్య పాదుకలు. కాబట్టి పదద్వయాన్ని ఇలా అర్ధము చేసుకోవాలి. *ప్రభాజాల* : అమ్మవారియుక్క కాంతికిరణములే ఆమె యుక్క పదములు అని అర్ధం. కిరణములే ఆమె ప్రభ, అదే ఆమె నడిచివెళ్లే తీరు, దృడంగా, నిశ్చలంగా . ఆ ప్రబలే పంచభూతములు సృష్టిస్తాయి. *పరాకృత* : పరా బిందువు శుక్లాబిందువు అవ్వటమే, పరా(shakti) యుక్క విశిష్టత. నామరూపాత్మక సృష్టికీ మూలప్రకృతి అవడమే పరాకృత. *సరోరుహ* : కలువ పూలు సరోవరము. సామాన్య అర్ధము. సరుహ లో ' రుహ' తో పుటుకలుఏర్పడినవి. 'హ' అంటే ఆకాశము . మొదట పుట్టినది. భూత సృష్టి ' హ' నిండే మొదలు అయినది. కాంతి కిరణము ప్రసరించిన చోటంతా సృష్టి అవుతుంది అని అర్ధము అమ్మవారి యుక్క పదద్వయం(పాదములు) సరోవరములో వుండే కలువ పూలు కంటే కాంతివంతంగా వున్నాయి. అమ్మవారి యుక్క రెండు పాదములు మానసిక దృఢత్వాన్ని, నిశ్చలతత్వాన్ని తెలుపుతాయి ఆ పాదములకు సాష్టాంగ ప్రణామములు🙏 అమ్మవారి యుక్క కాంతివంతమైన 🌺 *పాదములను* 🌺 సేవించే భాగ్యమును కలుగుటకు ప్రార్థన చేద్దాము 🙏 |