*కామేశ్వర* : ఈశ్వరచైతన్యమే ఈశ్వరుని కామేశ్వరుని చేసింది. నేనువున్నాను, నేను శక్తిమంతుడను /శక్తిమంతురాలిని అని తనంతట తాను తెలుసుకునే లక్షణమే కామేశ్వర.
*నిర్దగ్ధ* : సృష్టిలో ఎక్కడ ఏ ఉపద్రవం జరిగినా, పరస్పర మానవులు పోరాటాలు చేసినా., ప్రకృతివైపరీత్యాలు వచ్చినా, దగ్ధ కాండ ఎప్పుడు జరుగుతూనే వుంటుంది.
చెడుని దగ్ధం చేయటాన్ని నిర్దగ్ధ.
భండాసురుడు అన బడే రాక్షస రాజధాని శూన్యక నగరము. అంటే మన శరీరము. అతని పుత్రులు, మంత్రులు, సైనాధిపతులు అనగా, శరీరత్రయ, వాసనాత్రయ, అహాంత్రయ, అసుర వృతులు ఆ రూపేణ మనలో వున్నవి.
స్థూల సూక్ష్మ కారణ శరీరములు వున్నవి.
అవియే రాగం, ద్వేషం, లోభం, కోపం వంటి అసుర లక్షణాలు. శ్యామలా అనబడు మంత్రిణి చేతను, వారాహి అనబడు యంత్రరూప దండనాధ చేతను, కుమారి అనబడే క్రియాశక్తి చేతను నిహతులవుతారు.
అమ్మవారి దగ్గర వున్న పరివార దేవతలలో కొందరు ఆయుధ దేవతలు. ఈ దోషాలను తొలగిస్తాయి.
కామేశ్వరుడు అస్త్రము నుండి వెలువడిన అగ్నిచే భండాసుర సైయాన్ని భస్మీపటలం చేసిన తల్లికి నమస్కారము 🙏
🌺ఈ సృష్టి లో వున్న సమస్త మానవులు, తమలోని స్వార్థ బుద్ది పెరిగిపోయి, తాము ఎక్కడనుండి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము అన్న సంగతి మరిచిపోయి పరస్పరము కలహిస్తూ, ద్వేషిస్తూ, అసూయపడుతూవుంటారు. ఈ నామము వల్ల ఈ జన్మ శాశ్వతం కాదు అన్న విషయాన్నీ తెలుసుకుంటాము. అప్పుడు, స్వార్ధము అన్న దుష్ట ప్రభావాన్ని జయించి, అందరి పట్ల సమాంతర భావన చుపిస్తాము. అసూయా, ద్వేషం పోయి అందరితో ప్రేమగా మాట్లాడతాము🌺🙏.
|