శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
38. రత్నకింకిణకారమ్యరశానాదామహాభూషితా | ||
గూడార్ధములో రత్న అంటే మంత్రబీజములు, మాతృకావర్ణములు. *కింకిణికా* : మంత్రమును ఉపాసించేటపుడు కలిగే నాదము. రమ్యరశనాదామ: రమ్య శబ్దము వచ్చినా , సౌందర్య శబ్దము వచ్చినా ' శ్రీ ' అని అర్ధము చేసుకోవాలి. రమ్యరశనాదాము అంటే, నాద సౌందర్యాము చేత అలంకృతమైన అమ్మవారి మొలనూలు - కటి ప్రదేశము (నడుము). అమ్మవారి వడ్డాణముగా ఈ మంత్ర బీజములన్ని రత్నకింకిణకారమ్యరశానా దామముగా అవుతాయి. *భూషితా* : జగన్మాత, నాదస్వరూపిణి కనుక తాను నాదమునకు ఉత్పత్తిస్థానమై, జగత్తును స్పందముగా మర్చి జీవుల యుక్క వైఖరివాక్కును ప్రతిస్పందనముగా చేసుకొని, మరలా మాతృకావర్ణములు, బీజములు అన్ని ప్రణవమునందే లయించేటట్టుగా చేసి ఓం కారము నుండి హ్రీoకారము, హ్రీoకారమునుండి ఈoకారముగా ఆమె దగ్గరే చేరి పర్యవసిస్తాయి. అంటే ఆ నాదము చేత భూషితమైనది, అలంకృతమైనది అని అర్ధము. రత్నఖచితమైన చిరు గంటలతో రమ్యమైన మొలనూలును (వడ్డాణాన్ని ) ధరించిన తల్లికి నమస్కారము 🙏 🌺 *ఈనామం వల్ల మనలో కలిగే* *పరివర్తనములు* 🌺 మన కార్య సిద్ధి కోసం నడక సాగిస్తున్నపుడు , ఉతేజం కలిగి, ధ్వని, నాదం వంటి శబ్దములు, నిరాశను తొలగిస్తాయి. మన కర్మ ప్రయాణములో మనలోని శ్వాసను కూడా సమతుల్యం చేయగలుగుతాము. 🙏 |