శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
75. మంత్రీణ్యoబా విరచిత విషంగవధతోషితా | ||
*విరచిత* : సమస్త సృష్టినీ విధాత్రియై రచించినది. ఆమె చేత విరచితమైన ఈ సృష్టి నామ రూపాత్మకముగా వర్ధిల్లుచున్నది. *మంత్రిణ్యంబా :* శ్యామలాంబయే మంత్రిణ్యంబా. *వధతోషితా :* మన శరీరములో ఆ తల్లీ స్థాపిత కుండలినీయై మూడున్నర చుట్టులతో మూలాధారములో సర్పిణి గా వుంటుంది. స్వాధిష్ఠానము దగ్గర ఆమె తోకమీద నిలబడుతుంది. అంటే మూడున్నర చుట్టలు వదిలి పెడుతుంది. అదే జాగృత కుండలినీ. మణిపురము దగ్గర సుషుమ్న అవుతుంది. తాను బ్రహ్మాము అని తెలిసుకుంటుంది. ఇక ఆనందముతో పైకి పోతున్నప్పుడు ఈ వెనుక నున్న చక్రముయందలి భ్రమలనన్నిటిని శ్మశానము చేసి అప్పుడు పైకి వెళ్తుంది. అంటే వెనుక మరణము వున్నప్పటికీ ముందు మాత్రం ఆనందముగా వెళ్తున్న ఉన్మేయ భూమికలలోని ముఖ్యప్రాణస్వరూపిణియైన హంసయే వధతోషిత. అమ్మవారు మంత్రిణి రాజశ్యామల. శ్యామలాదేవి సర్వ కళా శాస్త్ర విఙ్ఞానమునకు అధిదేవత. వీణాశ్యామల, వేణుశ్యామల, ఇత్యాది,.. 🌺మనకి సామాన్య రీతిలో అర్ధము చేసుకోవాలిఅంటే మన బుద్ది చెడు ఆలోచనలు, భయము, భాద వంటివి విహాంగుడు అనే రాక్షసుడు ద్వారా మనలో ప్రవేశిస్తాడు. అమ్మవారిని ప్రార్థనతో శ్యామలా దేవి మనకి మంత్ర స్వరూపిణియై ఆ సమయానికి మనకు అనువైన జాగ్రత్తలను, సలహాలను మన మనసు ద్వారా తెలియ జేస్తుంది. ఆ విహాంగుడు అనే రాక్షసుడిని వధ చేస్తుంది. 🌺 శ్యామలా దేవి చేత విహాంగుడు అనే రాక్షసుడు వధింపబడుటంతో, సంతోషించిన తల్లికి నమస్కారము 🙏 |