శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
92. కులాంగనా | ||
అంటే పతివ్రత అని సామాన్య అర్ధం. ఆమే మహామాయా స్వరూపిణిగా ఇడ, పింగళతో కుడి కులమార్గములో వెళుతుంది. ఆమె పరంజ్యోతి కాబట్టి ఆమెకి స్త్రీ పురుష బేధము లేదు. కులమార్గమందు తాను సంచరించుచున్నప్పటికిన్ని, వాటిని పాలించుచున్నప్పటికిన్ని ఆ మాయ తనను అంటనటువంటి బ్రహ్మణి అని అర్ధం. కులమార్గమున ముఖ్య మార్గమే కులాంగన. పతియగు సదాశివుని చేరుటకే ప్రస్థానము అవుతున్నది కాబట్టి ఆమెకు కులాంగనా అని పేరు. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ఆ తల్కియుక్క పాతివ్రత్యాది లక్షణములు మనలో స్ఫురించి, మనము కూడా మన పతిదేవుడి ప్రీతి కొరకు ఆ మార్గము ని అనుసరిస్తాము 🌺 |